Tuesday, June 2, 2026
E-PAPER
Homeసినిమాహీరోల కోసం కథలు రాయకండి : గుణశేఖర్

హీరోల కోసం కథలు రాయకండి : గుణశేఖర్

- Advertisement -

‘నా కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. ‘యుఫోరియా’ ఇంకో ఎత్తు. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్లీ మళ్లీ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చూశాను. ఎంతో మంది అనలి టికల్‌గా రివ్యూలు చేస్తే.. వాటికే మిలియన్ల వ్యూస్ వచ్చేశాయిఅని దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. విభిన్న కథనాలు, మేకింగ్, టేకిం గ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటి కప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు దర్శకుడు గుణశేఖర్. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చిన ఆయన రీసెంట్‌గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని తెర కెక్కించారు. ఈ చిత్రానికి అద్భుత మైన స్పందన వచ్చింది. మంగళవారం పుట్టిన రోజు సందర్భంగా గుణశేఖర్ మీడియాతో ముచ్చటించారు. ఇటీవల నేను చేసిన 'యుఫో రియా సినిమాకి ఈటీవీ విన్‌లోనూ, ఆహాలోనూ అద్భుత మైన రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్‌ లోనూ రెంటల్ బేస్‌లో ఉంది. అక్కడా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. థియేటర్‌లో మిస్ అయ్యామని, మమ్మల్ని క్షమించండి అని చాలా మంది మెసెజ్‌లు పెడుతున్నారు. నిజంగా ఈ మూవీ నాకు ఒక కొత్త ఎనర్జీని ఇచ్చింది.
అసలు ఇలాంటి సినిమాని ప్రభుత్వమే కొనేసి, అందరికీ ఉచితంగా చూపించాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన, అవ గాహన కల్పించాల్సిన చిత్రం. కఠిన వాస్తవాల్ని చెప్పి తీరాల్సిందే, చూపించాల్సిందే.
హీరోల కోసం కథ రాయడం మానేయాలి. కథ రాశాక.. హీరో దగ్గరకు వెళ్లాలి. నేను అలా రాసి ఎంతో బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరో డేట్స్ ఉన్నాయి కదా అని, హీరోకి తగ్గ కథని అల్లడంతో మూసలోనే ఉండిపోతున్నాం.
‘హిరణ్యకశ్యప’ ప్రాజెక్ట్ ఉండదు. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -