Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను చూసి ఓట్లు వేయండి 

కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను చూసి ఓట్లు వేయండి 

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి 
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్
కోడి బ్రదర్స్ మోసగాళ్లు 
నవతెలంగాణ – చండూరు 

ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి కెసిఆర్ ప్రవేశపెట్టి పథకాలను చూసి ఓట్లు వేయాలని బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి  ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ పట్టణంలో  2,8 వార్డులో అభ్యర్థులు  ఆ నపర్తి శేఖర్, గన్నూరు జనార్ధన్  అభ్యర్థుల ఉద్దేశించి  కస్తా ల  రోడ్ షో లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరకాలంలో తెలంగాణ అంత అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి అన్నారు.

తాను గత ప్రభుత్వంలో రూ.30 కోట్ల‌తో అభివృద్ధి పనులు పూర్తిచేస్తే, ఇప్పుడు వచ్చి నేనే లైట్లు వేశా, నేనే రోడ్లు వేశా అని గొప్పలు చెప్పుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయని విష‌యం అంద‌రికీ తెలిసిందేనన్నారు. అమృత్ పథకం కింద తాను మంజూరు చేయించిన రూ.12 కోట్లల్లో ఇంకా రూ.6 కోట్ల నిధులు మున్సిపాలిటీలో మరుగుతున్న‌ట్లు తెలిపారు. ఆ నిధులు విడుదల చేయించి మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం లేద‌న్నారు. మున్సిపాలిటీలో మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని ఆయ‌న హామీ ఇచ్చారు.

కోడి బ్రదర్స్ కు మున్సిపాలిటీ అప్పజెప్పడం కోసం ఆరాట పడుతున్నారని, కోడి బ్రదర్స్ కు పాఠశాలల మీద ఉన్న ప్రేమ మున్సిపల్ అభివృద్ధిపై ఉండదన్నారు. వాళ్ల పాఠశాలల వల్ల ఇక్కడికి మోడల్ స్కూల్ గాని, ఇంటిగ్రేటెడ్ పాఠశాల తేవడం లేదన్నారు. వాళ్ళు పెద్ద మోసగాళ్లు అన్నారు.కావున బీఆర్ఎస్ కౌన్సిలర్ల‌ను గెలిపించాలని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, తేలు కుంట్ల  చంద్రశేఖర్  పెదగోని వెంకన్న, ఎత్తకు మధుసూదన్ రావు, అనిల్ రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -