Tuesday, June 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికోడిచెరువు వివాదాన్ని తేల్చాలి

కోడిచెరువు వివాదాన్ని తేల్చాలి

- Advertisement -

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కోడిచెరువు తాలూకు లొసుగులు తెలంగాణ ప్రభుత్వానికి ముందునుంచే తెలిసి ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ అంశం బయటకు రాకపోయి ఉంటే, జనసేన సమావేశం యథావిధిగా జూన్ 2న జరిగిపోయేది. చివరికి ఒక ప్రెస్ మీట్ తో సరిపెట్టుకో వలసి వచ్చింది. కానీ, ఈ వ్యవహారం ఒక ఛానల్‌ ‌ద్వారా వెలుగులోకి రావడంతో, అలాగే, ఆ ఛానల్ టీమ్ ఫీల్డ్ కి వెళ్లింది. సర్వే నంబర్ 706 చెరువులో ఉందని, అందులో ఫెన్సింగ్ చేసి, మట్టి నింపిన రుజువులు బయట పెట్టినందుకు, ఇటు ప్రభుత్వానికి, అటు జనసేన అధ్యక్షుడికి కోడి చెరువు భూమి విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇరు వర్గాలకూ ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది.ఇన్నాళ్లు స్పందించని ప్రభుత్వ వర్గాలు అకస్మాత్తుగా జనసేన పార్టీ తెలంగాణలో అవసరమా అన్నట్లుగా విమర్శలు గుప్పించడం, మరోవైపు జనసేన నాయకులు కోర్టు ద్వారా ప్రయత్నించినట్లు కనిపించడం వంటి పరిణామాలు ప్రజల్లో సందేహాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇరు వర్గాలు అంతర్గతంగా చర్చించుకుని, ఒక ప్రణాళిక ప్రకారం జరగాల్సిన జనసేన సమావేశాన్ని రద్దు చేసుకున్నారనే భావన కలుగుతోంది.
కోడి చెరువు ఖబ్జాకు గురైందా లేదా అన్న విషయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా హైడ్రా, ఎలాంటి కాలయాపన లేకుండా ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఆ చెరువు నిజంగా ఆక్రమణకు గురైందా లేదా అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చి చెప్పాలి. ఆక్రమణ జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి; జరగలేదని తేలితే ఆ విషయాన్ని కూడా బహిరంగంగా ప్రకటించాలి.అప్పటివరకు హైడ్రా ఇతర ఏ భూముల విషయంలో కూడా చర్యలు చేపట్టకుండా ఉండటం సమంజసం. ఈ అంశం తేల్చాకే ఏదైనా!
– సయ్యద్ రఫీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -