సంతోష్‌నగర్ పోలీసుల దర్యాప్తు
పోలీసు బృందాన్ని అభినందించిన సీపీ
నవతెలంగాణ-చార్మినార్
బాలికపై లైంగికదాడి కేసులో ఓ వృద్ధునికి హైదరాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సంతోష్‌నగర్ పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో బాధిత బాలికకు న్యాయం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళ్తే.. 2023 మే 11న గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లిన బాలికను మహ్మద్ జమీర్దీన్ (ప్రస్తుతం 70 ఏండ్లు) లోపలికి పిలిచి లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసును విచారించిన హైదరాబాద్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి పి.శివచంద్ర, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎ. రాంరెడ్డి, జె. రామకృష్ణ, న్యాయ సహాయక బృందం, కోర్టు డ్యూటీ సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి. సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.
బాలికపై లైంగిక దాడి..వృద్ధుడికి 20 ఏండ్ల జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



