Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అన్నారు., ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలను ఓర్పుగా ఆలకించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తన క్యాంపు కార్యాలయానికి వచ్చి విన్నవించుకోవచ్చని,   వీలైనంతవరకు ప్రజల సౌకర్యార్థం తాను ప్రజలను కలిసే పనిలోనే ఉన్నానని చెప్పారు .వారి సమస్యలే తన సమస్యలుగా భావించి పరిష్కార మార్గం చూపించడానికి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని స్థానిక ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలని అన్నారు. సమస్యలున్న వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం వెతకాలని మీ పరిధిలో లేని సమస్యలు ఉంటే తమ వరకు విన్నవించుకోవాలని స్థానిక నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి వచ్చిన వివిధ మండలాల లోని  గ్రామాల ప్రజలను కలుసుకోవడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -