– సొసైటీ ఇన్చార్జి సెక్రెటరీ రాకేష్ గౌడ్
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో హైబ్రిడ్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం సొసైటీ చైర్మన్ శివానంద్, కార్యదర్శి రాకేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మరియు కార్యదర్శి మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. అదేవిధంగా షెడ్యూలు ప్రకారం ముద్దస్థిగా విడుదల చేసిన గ్రామాలలోని సభ్యులు తేదీల వారి కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు. బుదువారం సావర్గావ్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ముగుడే కపిల్ , ఉపసర్పంచ్ చవాన్ సుధాకర్ ప్రారంభించారు. రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్ కిషన్ పవార్, గ్రామ పెద్దలు , గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



