- Advertisement -
నవతెలంగాణ-తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణలో భాగంగా ఆయన మామ, రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుతం ఇంటిలో ఎవరు లేరని తాళం వేసి ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేకపోయామని తదుపరి విచారణ జరుగనున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



