నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
పార్లమెంట్‌లో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సమావేశంలో పీఎం స్వనిధి పథకం అమలు పురోగతిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. వీధి వ్యాపారుల జీవనోపాధి మెరుగుదల, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ సాధికారత, ఆర్థిక కార్యకలాపాల ప్రోత్సాహంపై కమిటీ చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాల జారీ, డాక్యుమెంటేషన్ ఇబ్బందులు, అర్హులైన వీధి వ్యాపారుల గుర్తింపు, అలాగే క్రెడిట్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పథకం ప్రయోజనాలు ప్రతి అర్హులైన వీధి వ్యాపారికి సకాలంలో అందేలా విధానాలను సరళీకృతం చేయాలని ఆయన సూచించారు.
సీఎం స్వనిధి పథకం పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఎంపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



