Wednesday, June 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది: ఎస్పీ

బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది: ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 5న ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 2012 బ్యాచ్ కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ (35) గుండెపోటుతో మృతి చెందారు. స్వర్గస్తులైన కానిస్టేబుల్‌కు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు రాథోడ్ రష్మిక, రాథోడ్ తనిష్ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో రాథోడ్ విలాస్ కుటుంబ సభ్యులైన భార్య జ్యోతి, అన్నయ్య కైలాష్‌లకు భద్రత పథకం ద్వారా మంజూరైన రూ.8 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఇందులో భార్య జ్యోతికి రూ.4 లక్షలు, పిల్లలు రాథోడ్ రష్మిక, రాథోడ్ తనిష్‌ల పేర్లపై తలా రూ.2 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ మరణం పోలీసు శాఖకు తీరని లోటని ఎస్పీ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని లబ్ధులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శివకుమార్, సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -