– నేత్రదానం, శ్రేష్ట దానం, ఇద్దరు అందులకు చూపు దానం
– నేత్ర నిధి నిర్వాహకులు చిలకపాటి హనుమంతరావు
నవతెలంగాణ – బోనకల్ : నేత్ర దానం శ్రేష్ట దానం ఇద్దరు అందులోకు చూపు దానం అని ఖమ్మం నేతల నిధి నిర్వాహకులు చిలకపాటి హనుమంతరావు అన్నారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి ప్రేమికుడు పల్లా రామకోటయ్య మృతి చెందారు. తేజ కుటుంబ సభ్యులు రామకోటయ్య కళ్లను ఖమ్మం నేత్ర నీతికి దానం చేశారు. కళ్ళ దానానికి సంబంధించిన సర్టిఫికెట్లను ఖమ్మం నేత్ర నిధి నిర్వాహకులు చిలకపాటి హనుమంతరావు రామకోటయ్య కుమారుడు పల్లా కొండలరావు, కుటుంబ సభ్యులకు ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలో గల చొప్పకట్లపాలెంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఖమ్మం నేత్ర నిధి ప్రథమ స్థానంలో నిలిచింది అన్నారు. అందులోనూ ఖమ్మం జిల్లాలో చొప్పకట్లపాలెం గ్రామం నేత్రదానంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఒకరి నేత్రదానం ఇద్దరి అందులకు చూపునిస్తుందన్నారు. నేత్రదానం అంటే చాలామంది కళ్ళు పూర్తిగా తీస్తారని భావిస్తారని అది నిజం కాదన్నారు. కేవలం కళ్ళు మీద ఉన్న పొరలు మాత్రమే తీయడం జరుగుతుందని, కళ్ళు యధావిధిగా ఉంటాయని తెలిపారు. చొప్పకటపాలెం గ్రామంలో ప్రధానంగా చలమల అజయ్ కుమార్, పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు ఖమ్మం నేత్ర నిధికి కళ్ళు దానం చేయించడంలో విశేషమైన కృషి చేస్తున్నారని అభినందించారు. అదేవిధంగా చొప్పకట్లపాలెం గ్రామస్తుల కూడా ఎంతో చైతన్యవంతంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నేత్ర నిధి నిర్వహకులు, పల్లా రామకోటయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నేత్ర నిధి సర్టిఫికెట్ రామకోటయ్య కుటుంబ సభ్యులకు అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


