Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనాన్ని మోసగించింది రేవంత్‌రెడ్డే

జనాన్ని మోసగించింది రేవంత్‌రెడ్డే

- Advertisement -

మెదక్‌లో ప్రచారం చేయడానికి సీఎంకు భయం
దుబ్బాక ఎన్నికల సభలో హరీశ్‌రావు విమర్శలు

నవతెలంగాణ-సిద్ధిపేట
అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసగించాడని, చివరికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవుళ్లను కూడా మోసగించాడని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. మెదక్‌లో ప్రచారం చేయాలంటే సీఎం రేవంత్‌ రెడ్డి తనను చూసి భయపడుతున్నాడని, మెదక్‌ చుట్టూ తిరగాడని.. మెదక్‌ ప్రాంతానికి మాత్రం రావడం లేదన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ..కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి నీరు అందించిన మహానేత కేసీఆర్‌ అని, ఆయన నాయకత్వమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -