Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాలు అధికమైతే వ్యవసాయ పనులకు వెళ్లలేని దుస్థితి

వర్షాలు అధికమైతే వ్యవసాయ పనులకు వెళ్లలేని దుస్థితి

- Advertisement -

– పానాది రోడ్డు వేయాలని రైతులు, గ్రామస్తులు వేడుకోలు
నవతెగాణ – జుక్కల్ 

మండలంలోని మాదాపూర్ గ్రామంలో వర్షాలు అధికమట్టి కొండ ప్రాంతాల నుండి వచ్చే నీటి ప్రవాహ భారీగా ప్రవహిస్తుండడం వలన రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వెళ్లలేని దుస్థితి నెలకొని ఉన్నది మాదాపూర్ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నీళ్లు గా గ్రామంలోని రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు నాటి నుండి పానాది ఉండేది. పానాది దాటి వెళ్లాలంటే వర్షాలు పడినప్పుడు పర్వత ప్రాంతాల నుంచి భారీగా నీటి ప్రవాహం గ్రామ సమీపంలో ఉన్న కాలువ నుండి ప్రవహిస్తుంది. ఆ సమయంలో గ్రామం దాటి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రైతులు ఇటు గ్రామము నుండి బయటకు వెళ్ళలేదు. వ్యవసాయ పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ సమస్య పునరావృతం అవుతోంది. ఇందుకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్ ఆశా పటేల్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన సర్పంచ్ గ్రామస్తులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఉపాధి హామీ పథకంలో అంతర్గత రోడ్డు వేసుకోవడానికి, కాలువ దాటేందుకు కింది నుండి పైపులు వేసి పై నుండి మట్టి రోడ్డు వేస్తే రైతులు పొలం పనులకు వెళ్లేందుకు వీలుంటుంది ఆమె పై అధికారులకు తెలిపారు. అయినా నేటికీ ఆ విషయంపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. మళ్లీ వర్షాకాలం సమీపిస్తుండడంతో సమస్య మొదటికి వస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -