Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం: హెచ్ఎం సుదర్శనం

విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం: హెచ్ఎం సుదర్శనం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సమాజంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే సాధనమే విద్యని మండలంలోని వల్లెంకుంట హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు టి.సుదర్శనం అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మానవ విలువలు తరిగిపోతున్న తరుణంలో మనిషిని మనిషిగా మార్చి ప్రేమాభిమానాలను పెంపొందించే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం తమ పిల్లలను మన వూరి ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో చేర్పించితే ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, ఇంకా 21 వస్తువులున్న కిట్ ను అందిస్తోందని తెలిపారు. ప్రజాపరిపాలన భవిష్యత్ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బడిబాట గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మ రజిత, ఉపసర్పంచ్ స్వప్న, డిప్యూటీ తాసిల్దార్ సందీప్, వార్డు సభ్యులు, సిఆర్పిలు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -