దర్శకుడిగా హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కొత్త ప్రయా ణానికి శ్రీకారం చుట్టారు. తన 23వ చిత్రంతో ఆయన దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు.
రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇటీవల విడుదలైన ‘వీర’ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునావుకరసు (తిరు) ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా జాయిన్ అయ్యారు. ఈ చిత్రంతో రామ్ రచయిత-దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కొత్తగా ప్రారంభించిన రాపో సినిమా టిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మి స్తున్న ఈ చిత్రం ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ ఊల్ప్`అనే ట్యాగ్ లైన్‌తో నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతోంది.
భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన విజువల్ స్టైల్, ఫ్రేమిం గ్, లైటింగ్, కథనానికి ప్రాణం పోసే సినిమాటో గ్రఫీతో తిరు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. జాతీయ అవార్డు అందుకున్న ఆయన అను భవం, మూడ్, లైట్, సినీమాటిక్ టెక్స్చర్‌పై ఉన్న పట్టు ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చనుంది.
తిరు రూపంలో రామ్ సినిమాకి విజువల్ ట్రీట్
- Advertisement -
- Advertisement -



