Monday, June 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరెండు ఇరాన్ డ్రోన్లను కూల్చేశాం : అమెరికా

రెండు ఇరాన్ డ్రోన్లను కూల్చేశాం : అమెరికా

- Advertisement -

మారని ట్రంప్ వైఖరి : టెహ్రాన్
గల్ఫ్‌లో యూఎస్ స్థావరాల పైకి 
దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులు
ఇరాన్ నేతలతో పాక్ మంత్రి చర్చలు

టెహ్రాన్/వాషింగ్టన్ : మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రయోగి స్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేం దుకు అమెరికా సేనలు ప్రయత్నిస్తుం డగా కువైట్, బహ్‌రైన్‌లలో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. హార్ముజ్ జలసంధి ో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ముప్పుగా పరిణమించిన రెండు ఇరాన్ డ్రోన్లను నేల కూల్చామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సేనలు దాడులను ఉధృతం చేశాయి. లెబనాన్ వైపు నుంచి ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. దక్షిణ లెబనాన్‌లో ఓ సైనిక వాహనంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇద్దరు లెబనాన్ సైనికాధికా రులు, ఓ సైనికుడు మరణించారు. ఇదిలావుండగా పాక్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వి టెహ్రాన్ చేరుకున్నారు. అమెరికా తరఫున తదుపరి విడత చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఆయన ఆదివారం సమావేశ మయ్యారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్‌ లో నక్వీ పర్యటించడం ఇది మూడోసారి.

అమెరికా తరచూ తన వైఖరిని మార్చుకుంటోందని, పరస్పర విరుద్ధ వైఖరులు అవలంబిస్తోందని, అందుకే శాంతి చర్చలు ముందుకు సాగడం లేదని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై ఆదివారం టెహ్రాన్‌లో సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ మధ్య వర్తుల ద్వారా అమెరికాతో సందేశాలు పంచుకుంటున్నామని చెప్పారు. ‘వైఖరులను తరచూ మార్చుకుంటున్న కారణంగానే ట్రంప్ ప్రభుత్వంతో చర్చలు జరపడం ఇబ్బందిగా ఉంది. లక్ష్యాలను మార్చుకోవడం, విభిన్న ప్రకటనలు చేయడం, అధికారులు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం… ఇవన్నీ చర్చలకు ప్రతిబంధకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఇరాన్ హక్కులను గుర్తించాలన్న విషయాన్ని అమెరికన్లు అర్థం చేసుకోవాలని, అదే ప్రధాన విషయమని తెలిపారు. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కింద శాంతియుత అణు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇరాన్‌కు హక్కు ఉన్నదని విషయాన్ని కూడా వారు గ్రహించాలని చెప్పారు. ‘అదే సమయంలో స్తంభింపజేసిన మా ఆస్తుల గురించి అడుగుతుంటే వారు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -