Monday, June 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

కార్మికుల సమస్యలను
సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కనీస వేతనాలను సవరిస్తూ మే30న జీఓ నెం.6ను నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. జూన్ ఒకటి నుంచి జీవో అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పద్దతిలో కనీసవేతనాలు పెంచుతామని చెప్పి ఆచరణలో కార్మికులకు తగిన న్యాయం చేయలేదని విమర్శించారు. గతంలో ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ పద్ధతికి పూర్తి భిన్నంగా ఈ జీఓ ఉన్నదని తెలిపారు. కొన్ని షెడ్యూళ్ల లో కొంత వరకూ వేతనాలు పెరిగినప్పటికీ అత్యధిక కార్మికులు నష్టపోయే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కాం పేరుతో కొత్త డిస్కాం ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి చేసిందనీ, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ॥ 56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలనీ, ఐకేపీవీఓఏలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని భారాన్ని తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 2వ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ పని విధానం రద్దు చేసి 5 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.భవన నిర్మాణం కార్మికులకు (సిఎస్సీ) హెల్త్ టెస్టులు రద్దు చేసి, ఇన్సూరెన్స్ కంపెనీల ఇచ్చిన స్కీంలను ఉపసంహరించి, హమా లీలందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. 2 లక్షల మంది పవర్లూమ్ పరిశ్రమ కార్మికులకు 12 గంటల పని కాకుండా 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -