Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం 

ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం 

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
వివిధ సమస్యల పైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది.  ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి లో సమస్యలపై దరఖాస్తులు ఇచ్చేందుకు  వివిధ గ్రామాల నుంచి ప్రజలు కొన్ని వందల సంఖ్యల వచ్చేవారు. విషయాన్ని గమనించిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని  మండలాల  ఎంపీడీవోలు,  తాసిల్దార్లు, పంచాయతీరాజ్ ఏఈ లు,  ఆర్ అండ్ బి ఏఈ లు, విద్యుత్ శాఖ ఏఈ,  ఇలా అన్ని శాఖల అధికారులు హాజరు కావలసి ఉంటుంది.

 అచ్చంపేటలో ప్రజావాణి ని  కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సోమవారం 11:30 నిమిషాల కు ఆర్డిఓ, ఐసిడిఎస్, వెటర్నరీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు మాత్రమే వచ్చారు. మిగతా శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి ని కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. శాఖల వారిగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ( అర్జీదారులు) ఫిర్యాదుదారులు సమయపాలన పాటించని అధికారులపై మండిపడుతున్నారు. ప్రజావాణి కి రాణి అధికారులపై శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదారులు,  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -