నవతెలంగాణ – మర్రిగూడ: మండలంలోని మర్రిగూడ గ్రామంలో జరగబోయే శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ 58 వీధిలైట్లను మంజూరు చేయించారు. బుధవారం మర్రిగూడ టౌన్ సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్, మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వీధిలైట్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రధాన రహదారుల్లో వీధిలైట్ల ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వీధిలైట్లు ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్,గ్రామ శాఖ అధ్యక్షులు పోనుగోటి శేఖర్, వార్డ్ సభ్యులు మహమ్మద్ జమీర్, జర్పుల హనుమంతు, పగడాల లింగయ్య, సిలివేరు కల్పన రవి, తిరుమని అంజమ్మ, ఎస్టీ సెల్ శ్రీను నాయక్, అమంచ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ గ్రామంలో వీధిలైట్ల ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



