Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎనిమిది జీపీ గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు

ఎనిమిది జీపీ గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని ఎనిమిది జిపి గ్రామాలలో సోమవారం ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన ప్రత్యేక గారి గ్రామసభలు నిర్వహించడం జరిగిందని గ్రామాల  జిపి కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా కౌలాస్ సర్పంచ్ యంబరి విద్య , కత్తల్ వాడి సర్పంచ్ గోపాలరావు, బిజ్జల్ వాడి సర్పంచ్ వాగ్మారే గంగాబాయి మాధవ్, లాడేగావ్ సర్పంచ్ దేవకత్తే రాజశేఖర్ పటేల్, కంఠాలి సర్పంచ్ నాగనాథ్, లొంగన్ సర్పంచ్ నాగలగిద్దే ఉషారాణి సదు పటేల్, మాదాపూర్ సర్పంచ్ బుక్కావార్ ఆశా చందర్ పాటిల్, సావర్ గావ్ సర్పంచ్ కపిల్ , కేమ్రాజ్ కల్లాలి సర్పంచ్ కే. చంద్రకళ , గ్రామ ప్రత్యేక సభలలో పాల్గొని ప్రసంగించారు. జల సంరక్షణ – మన సంరక్షణ , వర్షపు నీటి సంరక్షణ, మొక్కలు నాటుట, వికసించే భారత్ గ్రాంట్ పథకం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, పంట మార్పిడి పై రైతులకు అవగాహన, విద్యుత్ సరఫరా వివరాలు, విద్యుత్ నియంత్రి కళ మరమ్మత్తులు, భూగర్భ జలాలు పెరిగేందుకు పూడికతీత పనులు, విపత్తు నిర్వహణ, రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ , డ్రగ్స్ నిర్మూలన , ఆత్మహత్యల నివారణ పై అవగాహన చేయడం జరిగిందని కౌలాస్ సర్పంచ్ ఏంబరి విద్య ఆయా గ్రామాల సర్పంచులు ప్రత్యేక గ్రామసభలో పేర్కొన్నారు. కౌలాస్ గ్రామంలోని సర్పంచ్ ఎందరి విద్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటడం జరిగిందని కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు , జిపి కార్యవర్గ సభ్యులు , జీపీ కార్యదర్శులు, గ్రామ మహిళా సంఘాల సభ్యులు, యువకులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -