Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలన ప్రభుత్వ ప్రగతిపై మద్నూర్ లో గ్రామసభ

ప్రజాపాలన ప్రభుత్వ ప్రగతిపై మద్నూర్ లో గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళికలు భాగంగా సోమవారం మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ లో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు డిపార్ట్మెంట్ల వారిగా ప్రజా పాలన ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించారు. గ్రామసభకు అధికారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, ఉపసర్పంచ్ రమేష్, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, ఎంపీడీవో రాణి, ఎంఈఓ రాములు నాయక్, గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -