రూ. 1 కోటి 50 లక్షల బకాయిలు
నవతెలంగాణ-అచ్చంపేట
పంచాయతీరాజ్ శాఖ, రోడ్ల భవనాల శాఖ, మన ఊరు మన బడి, ఈజీఎస్ పథకాల కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి థర్డ్ క్లాస్ కాంట్రాక్టర్ శేఖర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో, అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పనులు పూర్తి చేసి మూడేళ్లు గడుస్తున్న బిల్లులు రావడం లేదని దీంతో తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నట్లు శేఖర్ వెల్లడిచారు.
చేసిన పనుల వివరాలు
జడ్.పి.హెచ్.ఎస్ నడింపల్లి రూ.20 లక్షలు, జిహెచ్ఎస్ అచ్చంపేట రూ.40 లక్షలు, ఎంపీపీ ఎస్ స్కూల్ అయ్యవారిపల్లి రూ.32 లక్షలు, ఆశ్రమ పాఠశాల అచ్చంపేట రూ.20 లక్షలు , ఆశ్రమ పాఠశాల గర్ల్స్ అచ్చంపేట రూ.20 లక్షలు, ఆశ్రమ పాఠశాల వటువల్లపల్లి రూ. 5.లక్షలు, హెల్త్ సెంటర్ రూ. 6.లక్షలు , హెల్త్ సెంటర్ అమ్రాబాద్ రూ. 6.లక్షలు, హెల్త్ సెంటర్ కుమ్మరోని పల్లి రూ.6.లక్షలు , ముదిరాజ్ భవన్ కాంపౌండ్ వాల్ రూ.10 లక్షలు , ముస్లిం భవనం కాంపౌండ్ వాల్ రూ.10 లక్షలు , సిసి రోడ్డు నడింపల్లి రూ. 5.లక్షలు , సీసీ రోడ్డు నడింపల్లి రూ.5.లక్షలు, గ్రామపంచాయతీ భవనం నడింపల్లి రూ.1.50.వేలు , గ్రామ పంచాయతీ భవనం సిద్దాపూర్ రూ.1.50 వేలు మొత్తం రూ. కోటి 50లక్షలు బిల్లులు బకాయిలు ఉన్నాయి.
పనులు పూర్తి చేసి 3 ఏళ్ళు అవుతుంది. అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని థర్డ్ క్లాస్ కాంట్రాక్టర్ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోటి యాభై లక్షల బిల్లులు పెండింగ్ ఉండడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా వస్తున్నాయని మానసికంగా చాలా అవస్థలు పడుతున్నానని శేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి చేసిన పనులకు బిల్లులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.



