Monday, June 8, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో యెజ్దీ స్క్రాంబ్లర్ 350, BSA స్క్రాంబ్లర్ 650

హైదరాబాద్‌లో యెజ్దీ స్క్రాంబ్లర్ 350, BSA స్క్రాంబ్లర్ 650

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: యెజ్డీ మరియు BSAలు తమ కొత్త స్క్రాంబ్లర్స్ రీటైల్ విడుదలను ప్రకటించాయి, అవి ఇప్పుడు  హైదరాబాద్ తమ అథీకృత డీలర్ షిప్స్ లో లభిస్తున్నాయి.  నగరాల్లో సౌకర్యవంతంగా, జాతీయ రహదారులపై స్థిరంగా మరియు ట్రయల్స్ లో ఉత్తేజకరంగా ఉండే వాహనం కోసం పరిశీలిస్తున్న రైడర్ కోసం, అసలైన స్క్రాంబ్లర్ వారసత్వం ఉన్న బ్రాండ్స్ వేరు ధరల్లో రెండు విలక్షణమైన మోటార్ సైకిల్స్ ను అందిస్తున్నాయి. యెజ్డీ స్క్రాంబ్లర్ 350 మరియు BSA స్క్రాంబ్లర్ 650లు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ ట్రైయిన్స్ తో పాటు శక్తివంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉన్నాయి.

భారతదేశపు తేలికైన 350 సిసి స్క్రాంబ్లర్,  చురుకైన యెజ్డీ స్క్రాంబ్లర్ లు  పట్టణంలో ప్రయాణించడానికి మరియు వారాంతాల్లో విహారాల కోసం   తీర్చిదిద్దబడ్డాయి. కొత్త లిక్విడ్-కూల్డ్ కటార్ ఇంజన్ అనేది మోటార్ సైకిల్ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక కేంద్రం. శక్తివంతమైన టార్క్- నుండి బరువు నిష్పత్తితో మరియు ప్రతిస్పందించే పనితీరుతో, ఇది రూ. 1,99,950 పరిచయ ధరతో ప్రారంభమవుతోంది.

శ్రేణిలో భారతదేశపు ఏకైక 650 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ తో శక్తిని పొందే BSA స్క్రాంబ్లర్ 650 అసలైన బ్రిటిష్ స్క్రాంబ్లర్ శైలిని, తక్కువ మరియు మధ్య శ్రేణిలో లభించే శక్తివంతమైన టార్క్ పనితీరుతో కలిసింది. ఇది BSA యొక్క ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ స్టార్ కటాలినా, A10 స్పిట్ ఫైర్, మరియు A65 ఫైర్ బర్డ్ వంటి చారిత్రక దిగ్గజాల నుండి తన ప్రత్యేకమైన డిజైన్ ను స్వీకరించింది. ఈ మోటార్ సైకిల్ రూ. 3,24,950కి ప్రారంభపు పరిచయ ధరకి లభిస్తోంది.

శ్రీ. అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, “స్క్రాంబ్లర్స్ కు మోటార్ సైక్లింగ్ ప్రపంచంలో  SUVలుగా మారే సామర్థ్యం ఉంది, ఇవి  తమ మోటార్ సైకిల్స్ పై రైడర్స్ కు ఉన్న అంచనాలను  శాశ్వతంగా మారుస్తాయి. ఈ మెషీన్లు ఆత్మవిశ్వాసంతో కూడిన సిటీ-రైడింగ్ కోసం మరియు అంతకంటే ఎక్కువ లక్ష్యాల కోసం రూపొందించబడ్డాయని మేము ఆశిస్తున్నాము  మరియు యెజ్డీ మరియు BSAలు యొక్క డిజైన్ సిగ్నేచర్స్ ను కలిగి ఉన్నాయి మరియు వారాంతాల్లో రహదారులను మించిన భూభాగాలను అన్వేషించడానికి  హైదరాబాద్ ని ప్రేరేపిస్తాయి.  యెజ్డీ స్క్రాంబ్లర్ తన స్థిరమైన మరియు పనితీరులో ఒక దృడమైన చురుకైన తుఫానులా ఉండగా, BSA స్క్రాంబ్లర్ ఖండాలు అంతటా ఈ ఫార్మాట్ కు మొదట స్ఫూర్తిని ఇచ్చిన తన బ్రిటీష్ వారసత్వాన్ని తెలియచేసింది.”

ఈరోజు చేసిన విడుదలలు స్క్రాంబర్స్ యొక్క అసలు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన రెండు కొత్త మోటార్ సైకిల్స్ తో, స్ప్రాంబ్లర్స్ పట్ల  యెజ్డీ మరియు BSA యొక్క నిబద్ధతను మరింత విస్తరిస్తున్నాయి.

సరికొత్త స్క్రాంబ్లర్స్ మరియు యెజ్డీ మరియు BSA మోటార్ సైకిల్స్ యొక్క పూర్తి శ్రేణిని అనుభవించడానికి కస్టమర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో తమకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ను సందర్శించవచ్చు.

అన్ని డీలర్ షిప్స్ సేల్స్, సర్వీస్ మరియు ఆఫ్టర్ సేల్స్ మద్దతును అన్నింటినీ ఒకే చోట అందిస్తున్నాయి, మరియు కంపెనీ వారి కస్టమర్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మద్దతు చేయబడుతున్నాయి, ఈ కింది అంశాలతో సహా విశ్వాసం మరియు మనశ్సాంతితో దీర్ఘకాలం యాజమాన్యాన్ని మద్దతు చేయడానికి రూపొందించబడ్డాయి:

  • 4- సంవత్సరాలు/50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ
  • 6 సంవత్సరాల వరకు పొడిగించబడిన వారంటీ ఎంపికలు
  • ఒక ఏడాది వరకు రోడ్డు సైడ్ సహాయం
  • దేశవ్యాప్తంగా 400+ సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్స్ ను మద్దతు చేస్తుంది
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -