Monday, June 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పేదలకు ఉచిత, నాణ్యమైన విద్యా-వైద్య సేవలు అందించాలి: భూపాల్

పేదలకు ఉచిత, నాణ్యమైన విద్యా-వైద్య సేవలు అందించాలి: భూపాల్

- Advertisement -

నవతెలంగాణ – ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారుతున్నాయని, ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మరియు ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పేర్కొంది. ఫలితంగా పేద ప్రజలు ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తూ అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. విద్య, వైద్యం హక్కులుగా అమలు చేయాలని, వాటిని వ్యాపార వస్తువులుగా మార్చే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేసింది.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పేదలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్, గకుమార్ గోడిసెల, కార్తీక్ నాయకులు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -