నవతెలంగాణ – మల్హర్ రావు:- సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తొలకరి జల్లులు పలకరికచడంతో రైతున్నలు ఆనందంతో మురుశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె ప్రవేశించిన వెంటనే సోమవారం సాయంత్రం తొలకరి జల్లులు కురిసాయి. మండు వేసవి,ఉక్కపోతతో ఇన్ని రోజులు అల్లాడుతున్న ప్రజలకు, బీడువారిన భూములకు ఈ తొలకరి చినుకులు ఊరటనిచ్చాయి. తొలకరి చినుకులు పడగానే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మృగశిర కురిస్తే ముసలెద్దు కూడా రంకెవేస్తుంది” అన్న సామెతను నిజం చేస్తూ రైతులు దుక్కులు దున్నే పనిలో నిమగ్నం కానున్నారు. ఒకవేళ మృగశిర కార్తెలో తొలకరి పలకరించకుంటే మృగశిరలో దాహంతో మృగాలు గాండ్రిస్తాయని అన్న సామేత , అలాగే మృగశిర కార్తె ప్రారంభం నేపథ్యంలో మార్కెట్లు చేపలతో నిండిపోయాయి, వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను అందినకాడికి దోచుకున్నారు.
తొలకరి పలకరించే…రైతన్న మురుసే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



