Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకిటకిటలాడిన 
ముషీరాబాద్ ఫిష్ మార్కెట్

కిటకిటలాడిన 
ముషీరాబాద్ ఫిష్ మార్కెట్

- Advertisement -


చేపల కొనుగోలుకు భారీగా తరలివచ్చిన జనం
నవతెలంగాణ – ముషీరాబాద్

​మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌‌లోని ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యమనే నమ్మకం ఉండటంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే చేపల కొనుగోళ్ల కోసం బారులు తీరారు. ముఖ్యంగా రవ్వ చేప, బొమ్మిడాయి, కొరమీను, రొయ్యలకు అధిక డిమాండ్ నెలకొంది. ధరలు కొంత పెరిగినప్పటికీ కొనుగోళ్లలో ఎలాంటి తగ్గుదలా కనిపించలేదు. చేపల ధరలు కిలోకు రూ.200 నుంచి రూ.800 వరకు పలికాయి. అలాగే, జిల్లాల్లోనూ చేపల మార్కెట్లు, చెరువుల వద్ద సందడి నెలకొంది. సాధారణ రోజుల్లోనే ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు భారీగా కొనుగోలుదారులు వస్తుంటారని, మృగశిర కార్తె సందర్భంగా అయితే దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి చేపలను కొనుగోలు చేస్తారని వ్యాపారులు తెలిపారు. ప్రతి ఏడాదీ మాదిరిగానే ఈసారి కూడా మంచి వ్యాపారం జరిగిందన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి తాజా చేపల సరఫరా జరిగిందని వ్యాపారులు తెలిపారు. దీంతో వినియోగదారులకు విభిన్న రకాల చేపలు అందుబాటులోకి వచ్చాయి. ఇక వినియోగదారులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు సరైన తూకంతో చేపలను విక్రయిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. అటు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే శుభ్రమైన వనరుల నుంచి తీసుకున్న చేపలను మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -