Thursday, February 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకెనడా పాఠశాలలో కాల్పులు

కెనడా పాఠశాలలో కాల్పులు

- Advertisement -

10 మంది మృతి..25 మందికి గాయాలు

ఓంటారియా: కెనడాలో కాల్పుల కలకలం రేగింది. బ్రిటష్‌ కొలంబియాలోని పాఠశాలలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో కాల్పులుకు తెగబడిన షూటర్‌ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. టుంబ్లెర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్‌ లోపల ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు వెల్లడించారు. మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు తెలిపారు. స్కూల్‌ సమీపంలోని ఓ ఇంట్లో మరో రెండు మృతదేహాలను గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -