– పంచాయతీ కార్మికులకు వేతనాలందించాలని సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మండలంలో సంపూర్ణంగా విజయవంతం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లపై అయా గ్రామాల పంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సమ్మె నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల సంక్రమంగా వేతనాలందించి.. కార్మికుల హక్కులను కాలరాసేల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికుల చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు తిప్పారపు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల నాయకులు సాయికృష్ణ, లింగం, ఎల్లయ్య, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు బోనగిరి లక్ష్మన్, అశోక్, శివ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె సంపూర్ణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



