Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదరికాన్ని జయించిన విద్యార్థిని.. మహేశ్వరి

పేదరికాన్ని జయించిన విద్యార్థిని.. మహేశ్వరి

- Advertisement -

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ
నవతెలంగాణ – మునిపల్లి

పట్టుదల ఉంటే కానిది లేదు అంటారు. పేదరికాన్ని జయించి ఓ విద్యార్థి రాష్ట్రస్థాయి లో గుర్తింపు తెచ్చే విధంగా ఇంటర్మీడియట్లో మార్కులు సాధించింది. మనసులో పట్టుదల ఉండాలి తప్ప విజయాన్ని అవలీలగా చేరుకోవచ్చని నిరూపించింది. వివరాలలోకి వెళితే మండలం లోని మేళాసంఘం గ్రామానికి చెందిన కవులే స్వప్న – నర్సిములుది నిరుపేద కుటుంబం. రెక్కాడితే డొక్కాడని పేదరిక కుటుంబం వారిది. అయితే వారి కుమార్తె మహేశ్వరీ మాత్రం కుటుంబ పరిస్థితులను లెక్కచేయలేదు. గురుకుల జూనియర్ కళాశాలలో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి ఔరా అనిపించింది. జహిరాబాద్ మండలం హోతి -కే గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో చదివిన మహేశ్వరీ తల్లిదండ్రుల తోడ్పాటు ఉపాధ్యాయుల సహకారంతో అబ్బురపరిచే ప్రతిభను చాటింది.

• తల్లిదండ్రులతో మహేశ్వరి..
• మా గ్రామానికి చెందిన విద్యార్థి 1000 మార్కుల గాను 990 మార్కులు సాధించడం మా గ్రామానికి గర్వకారణం. ఇలాంటి పట్టుదల స్ఫూర్తి ఉన్న విద్యార్థులకు తమ వంతుకు అండగా ఉంటాం. విద్యార్థి భవిష్యత్తులో మంచి విజయాలను పొందే విధంగా వెన్ను తట్టి ప్రోత్సహిస్తాం… కుప్నాగారం లక్ష్మీ సంగమేశ్వర్ సర్పంచ్ గ్రామపంచాయతీ మేళాసంఘం.

• పిల్లలలో ఆసక్తి,సృజనాత్మకతను వారి యొక్క అభిరుచులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తగిన తోడ్పాటును అందించాలి. ప్రతిభ అనేది ప్రతి విద్యార్తిలో ఉంటుంది. అంతర్లీనంగా ఉన్న ప్రతిభను గుర్తించి తగిన తోడ్పాటు అందించి ప్రేరణ కలిగిస్తే ఎలాంటి విద్యార్థులైన విజయావకాశాలు పొందడం సులభం. మహేశ్వరి చిన్ననాటి నుండే చురుకైన విద్యార్థిగా పాత్ర పోషించేది…. తెలుగు యాదగిరి ఉపాధ్యాయుడు గ్రామం మేళాసంఘం.

• ఇంటర్మీడియట్ ఫలితాల్లో 990 మార్కులు సాధించడం నాకు గర్వకారణంగా ఉంది. మళ్లీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో మరిన్ని మెరుగైన మార్కులు తెచ్చుకొని రాష్ట్రస్థాయిలో ఇంకా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో మంచి ఇంజనీరింగ్ రంగంలో స్థిరపడాలని ఉంది. తల్లిదండ్రుల తోడ్పాటు ఉపా ధ్యాయుల సహకారం ఎన్నడు మరువలేనిది…. మహేశ్వరి – విద్యార్థి.

• విద్యార్థి  పట్టుదలను స్ఫూర్తిని మా పాఠశాల విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో మహేశ్వరి లాంటి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. సునీత ప్రధానోపాధ్యాయురాలు ప్రాథమిక పాఠశాల మేళాసంఘం.

• మా పాఠశాలకు చెందిన విద్యార్థికి అరుదైన మార్కులు లభించడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ అమ్మాయికి చదువు విషయంలో పూర్తి సహకారం మా ఉపాధ్యాయుల వైపు నుండి ఉంటుంది. మహేశ్వరి భవిష్యత్తులో ఇంజనీరింగ్ రంగంలో మంచి భవిష్యత్తును పొందాలని కోరుకుంటున్నాం…. రాజు ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల మేళ సంఘం.

• నేను అప్పట్లో ప్రాథమిక పాఠశాల మేళసంఘం లో పనిచేసినప్పుడు తరగతిలో మహేశ్వరి చురుకైన విద్యార్థిగా ఉండేది. అప్పట్లోనే విద్యార్థి యొక్క సృజనాత్మకతను గుర్తించాం. మహేశ్వరి మరిన్ని విజయావకాశాలు పొందాలని కోరుకుంటున్నాను. బోయిని సిద్దేశ్వర్ పూర్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల మేళాసంఘం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -