Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన

పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – సిర్పూర్(టి )
మండలంలోని వేంపెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పోషణ్ పక్వాడ కార్యక్రమం భాగంగా తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

కేంద్రాల్లో నమోదు అయిన ప్రతి ఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. శారీరకంగా ఎదుగుదల, మంచి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని వివరించారు. సమావేశంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా శిశువు జననం నుంచి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కాలంలో సరైన పోషణ అందితే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని తెలిపారు.

అలాగే చిన్నపిల్లల అభివృద్ధిలో మైలురాళ్లు సక్రమంగా చేరుకోవాలంటే తల్లులు సరైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లెండుగురే సత్తయ్య, ఉపసర్పంచ్ రాజు కుమార్, ఏపీఎం మహేష్, ఏఎన్ఎం లలిత, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఐకేపీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

మండలంలోని వేంపెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పోషణ్ పక్వాడ కార్యక్రమం భాగంగా తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

కేంద్రాల్లో నమోదు అయిన ప్రతి ఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. శారీరకంగా ఎదుగుదల, మంచి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని వివరించారు.

సమావేశంలో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా శిశువు జననం నుంచి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కాలంలో సరైన పోషణ అందితే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని తెలిపారు.

అలాగే చిన్నపిల్లల అభివృద్ధిలో మైలురాళ్లు సక్రమంగా చేరుకోవాలంటే తల్లులు సరైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లెండుగురే సత్తయ్య, ఉపసర్పంచ్ రాజు కుమార్, ఏపీఎం మహేష్, ఏఎన్ఎం లలిత, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఐకేపీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -