Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం

అంగన్వాడీలో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పర్వేదుల సెక్టార్ పరిధిలోని కోమటి కుంటతండా అంగన్వాడీ కేంద్రంలో బుధవారంపోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంగన్వాడీ సూపర్ వైజర్ వెంకాయమ్మ గర్భిణి స్త్రీలు, బాలింత తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు.పోషక ఆహార విలువలు, మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు.

ప్రతి ఒక్క మహిళ రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అమ్మాయి లకు 18 సంవత్సరాల నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయ్యాలి అని, ఫోక్స్ చట్టం గురించి, సైబర్ బుల్లింగ్ గురించి, సోషల్ మీడియా కు బానిసలు కాకుడదని ఈ విషయాలు అన్నింటి పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వెంకాయమ్మ, సర్పంచ్  రమావత్బాబి,ఉప సర్పంచ్  కొర్రా నరేందర్,వార్డు మెంబర్ కొర్రాబాబు, అంగన్వాడీ టీచర్లు నీల,నివేదిత,రజిత అంగన్వాడీ లబ్ధిదారులు పాల్గోన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -