నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో మన గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి 2026-2027 కు సంబంధించిన ఆర్థిక సంవత్సరం100 రోజుల గ్రామీణ ఉపాధి హామి పథకం (కరువు పని) ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ 100 రోజుల ఉపాధి హామీ పథకం గొప్ప పథకం అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని, ఎండాకాలం సందర్భంగా తగిన ఆరోగ్యజాగ్రత్తలు తీసుకుని ఉపాధి పొందాలని కోరారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్ కు సూచిస్తూ,ఎండాకాలం దృష్ట్యా ఉపాధి కార్మికులకు మంచి నీటి సదుపాయం, నీడ గొడుగులు, ఓ ఆర్ ఎస్ ప్యాకిట్లు అందించి వారికి తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దొంకేన పాండురంగం, పిన్నెం పాండు, మాజి ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, ఎడ్ల ప్రతాప్ రెడ్డి, దొంకేన అశోక్ గ్రామస్థులు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



