Wednesday, April 15, 2026
E-PAPER
Homeఖమ్మంవేగం కన్నా ప్రాణం మిన్న

వేగం కన్నా ప్రాణం మిన్న

- Advertisement -

– జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా గమ్యానికి చేరుకోండి 
– రోడ్డు భద్రత సామాజిక బాధ్యత – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
– చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి కారణం – ఎస్పీ రోహిత్ రాజు 
– ఎరైవ్ ఎలైవ్ లో రహదారి నియమాలు పై అవగాహన 
నవతెలంగాణ – అశ్వారావుపేట

రహదారి ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని, వాహనం నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో అంతర్భాగం అయిన “ఎరైవ్ ఎలైవ్” కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌ లో  రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ నాయకులు, అధికారులు రహదారి నియమాలపై అవగాహన ఉండటం ఎంతో ముఖ్యమని, నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. వాహనం నడుపుతున్నప్పుడు వేగాన్ని నియంత్రించాలి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు అని, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి అని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా పలువురు వాహనదారులకు హెల్మెట్‌ లు పంపిణీ చేసి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ నాగరాజు,ఎస్.హెచ్.ఓ యయాతి రాజు,ఎస్.ఐ అఖిల, ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి జవీరభద్రరావు, మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, తహశీల్దార్ దాసరి కిశోర్,ౠ ఎంపీడీవో అప్పారావు, ఎంఈఓ ప్రసాదరావు, ఆర్ & బీ డీఈఈ ప్రకాశ్, ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మౌనిక, పీఆర్ ఏఈఈ అక్షిత లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -