- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామంలో తిరుమల హచరీస్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన నూతన వాటర్ ఫిల్టర్ ను ఆ గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓం ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు సహకరించిన తిరుమల హచరీస్ యాజమాన్యానికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చుక్కల శంకర్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



