నవతెలంగాణ – భువనగిరి
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీ వాణి, వైస్ చైర్మన్ తెలిపారు. బుధవారం పట్టణంలోని 5,6,16,27, 29 31 34 35 వార్డులలో ప్రగతి ప్రణాళిక సభలలో వారు మాట్లాడారు. సాలిడ్ వెస్ట్ మేనేజిమెంట్ రూల్స్, 2026, జల్ సంచయ్ – జల్ భగీరత పథకం క్రింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టుట, మురికి కాలువల శుభ్రం చేయుట, పూడిక తీయు పనులు, వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక, మంచి నీటి సరఫరా, నిర్వహణ, నీరు నిలువ ప్రాంతాల నివారణ, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, వీది దీపాలు, మొక్కలు, పర్యావరణ సంరక్షణ అంశాలను మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజలకు వివరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ కే చంద్ర ప్రకాష్ రెడ్డి, స్థానిక గౌరవ వార్డు సభ్యులు సుమయ తబుసం షఫీక్ అహ్మద్, సరగడ రాజ్యలక్ష్మి అమరేందర్ లు పాల్గొన్నారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



