- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ధుండ్ర లచ్చక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి బుధవారం మృతురాలు కుటుంబాన్ని పరమర్శించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ధైర్యానిచ్చారు. అదేవిధంగా రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల దేవేందర్,కాంగ్రెస్ నాయకులు అబ్బినేని తిరుపతి,పోచంపెల్లి కత్తెరసాల,ఎరవేని కొండగట్టు పాల్గొన్నారు.
- Advertisement -



