నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వానలకు తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో పలు చోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. తాజాగా రాత్రి వీచిన ఈదురు గాలులకు రాంనగర్‌లోని రీసాల గడ్డ ఆర్‌కే నగర్ కాలనీలో భారీ వృక్షం కొమ్మ విరిగి కాలనీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అయినా కూడా అధికారులు ఇప్పటివరకు ఆ విరిగిన కొమ్మను తొలగించలేదు. దీంతో స్థానిక కాలనీవాసులతో పాటు వాహనాదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పంచింది..సదురు కొమ్మను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదే విధంగా ఆర్టీసీ కళ్యాణ మండపం సమీపంలో కూడ చెట్టు కొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అయినా కూడా సదురు కొమ్మను అధికారులు తొలగించలేదని, తక్షణమే విరిగిన కొమ్మను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.




