అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తాం
ఎర్రబెల్లి గూడెం గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ఎర్రబెల్లి గూడెం నుండి కాచికల్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై గుంతలను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మరళి నాయక్ సహకారంతో మట్టి తెప్పించి గుంతలను పూడ్చినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుండా బోయిన ఉష అశోక్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ తో కలిసి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రబెల్లి గూడెం గ్రామం నుండి కాచికల్ మీదుగా నెల్లికుదురు మరియు తొర్రూరు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు వెళ్లలేని పరిస్థితి ఉందని రోడ్డు మొత్తం గుంతల మాయమై ఎక్కడ ఏమి జరుగుతుందో అనే భయభ్రాంతులకు గురవుతున్న సందర్భంలో ఎమ్మెల్యే సహకారంతో ఎర్రబెల్లి గూడెం నుండి కాచికల్ వరకు మట్టిని తెప్పించి గుంతలు లేకుండా కూర్చోమని అన్నారు.
అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు నిజ ప్రాంతాలకు వెళ్తున్నారు కావున వారికి ఇబ్బంది లేకుండా మరియు రైతులకు విత్తనాలు ఎరువులు తీసుకొని వచ్చేందుకు అవస్థలు పడకుండా ఉండేందుకే ఈ గుంతలు పూడ్చామని అన్నారు త్వరలోనే ఈ రహదారి బీటీ రోడ్డుగా మారుతుందని తెలిపారు ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఈ గుంతలు పూడ్చా వరి తెలిపారు అంతేకాకుండా ఈ ఎర్రబెల్లి గూడెం గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే ముఖ్య సమస్యలను గుర్తించి పరిష్కారగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది పాల్గొన్నారు.



