షెడ్యూల్ ఖరారు చేసిన రాష్ట్ర కార్మికశాఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు నూతన లేబర్ కోడ్‌లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు అధికారుల కమిటీలను ఏర్పాటు చేసింది. యాజమాన్యాలు,
షెడ్యూల్ వివరాలు
1). సోషల్ సెక్యూరిటీ కోడ్–2020.. జూన్ 11న (ఉదయం 11 గంటలకు)
2).కోడ్ ఆన్ వేజెస్ – 2019… జూన్ 12న (ఉదయం 11 గంటలకు)
3).ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ – 2020..
(జూన్ 15 ఉదయం 11 గంటలకు)
4).ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్–2020.. (జూన్ 16 ఉదయం11 గంటలకు)ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కమిటీలు సంప్రదింపు సమావేశాలను నిర్వహించనున్నాయని ఆ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గురువారం నుంచి ఈనెల 16 వరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల అంజయ్య భవన్‌లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని వెల్లడించారు. ప్రతిపాదిత నిబంధనలపై తమ అభిప్రాయాలు తెలియజేయదలచిన యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల ప్రతినిధులు, ఇతర వాణిజ్య సంఘాలు ఆయా తేదీల్లో నిర్వహించే సమావేశాలకు హాజరై తమ సూచనలు అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సంప్రదింపుల ద్వారా కార్మికులు, యజమానులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర నిబంధనలను మరింత సమగ్రంగా రూపొందించనున్నట్టు తెలిపారు.
నూతన లేబర్ కోడ్‌ల అమలుపై సంప్రదింపులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



