Thursday, June 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీ కస్టడీకి జలమండలి జీఎం లక్ష్మీకుమార్‌‌

ఏసీబీ కస్టడీకి జలమండలి జీఎం లక్ష్మీకుమార్‌‌

- Advertisement -

చంచల్‌‌గూడ జైలుకు అవినీతి ఈఎన్‌‌సీ మోహన్‌ ‌నాయక్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌‌గూడ జైలులో ఉన్న జల మండలి జీఎం ఎస్‌ లక్ష్మీకుమార్‌‌ను తదుపరి విచారణ కోసం ఏసీబీ అధికారులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. గతనెల 19న లక్ష్మీకుమార్ ఆస్తులపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను ‌సంపాదించినట్టు గుర్తించి ఆయనను అరెస్ట్‌ ‌చేసిన విషయం విదితమే. చంచల్‌‌గూడ జైలులో ఉన్న లక్ష్మీకుమార్‌‌ను తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు అభ్యర్థించగా.. రెండ్రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు లక్ష్మీకుమార్‌‌ను తమ అదుపులోకి తీసుకొని బంజారహిల్స్‌‌లోని ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించారు. లక్ష్మీకుమార్‌‌ ‌సంపాదించిన ఇతర అక్రమాస్తుల గురించి అదనపు ఎస్పీ స్థాయి నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారణను జరుపుతోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం అరెస్ట్‌ ‌చేసిన రోడ్డు భవనాల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ (ఈఎన్‌‌సీ) ‌మోహన్‌ ‌నాయక్‌‌ను బుధవారం ఏసీబీ అధికారులు చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. ఈ అధికారి ఆస్తులపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు దాదాపు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను మోహన్‌‌నాయక్‌ ‌కలిగి ఉన్నట్టు గుర్తించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -