నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కొనసముoదర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన లాడే చరణ్ (18) మృతి చెందినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్కూటీపై గ్రామానికి విచ్చేస్తున్న లాడే చరణ్ ను ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడి తండ్రి లాడే అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాడే చరణ్ మృతి పట్ల సర్పంచ్ బెజ్జాల రాకేష్, పలువురు గ్రామస్తులు సంతాపం తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



