Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలి

చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలి

- Advertisement -

హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల
నవతెలంగాణ-అచ్చంపేట
చేతివృత్తుల ద్వారా తయారు చేసిన వస్తువులు బహిరంగ మార్కెట్ లో విక్రాయిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలంగాణ హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని శాలివాహన కుమ్మర సత్రంలో వెదురు ద్వారా వస్తువులు చేస్తున్నటువంటి హస్త కళాకారులకు తెలంగాణ హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల, అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 50 మందికి రూ.5 లక్షల విలువైన 13 రకాల పనిముట్ల కిట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సువర్చల మాట్లాడుతూ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, దీనికోసం భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని ఆర్థిక  స్వావలంబన వైపు వెళ్లే విధంగా హస్తకళలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 50 మంది వెదురు హస్త కళాకారులకు 13 రకాల పనిముట్లు అందజేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

 అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ విజయ సాగర్ రెడ్డి మాట్లాడుతూ హస్త కళాకారులు చేసినటువంటి వస్తువులను ప్రభుత్వమే ఎగ్జిబిషన్ల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ప్రయాణ ఖర్చులతో పాటు, ప్రతిరోజు భోజన ఖర్చులు, వసతి ఖర్చులు అందజేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో హస్తకళల కళాకారులకు శిక్షణ శిబిరాలు, స్టడీ టూర్ లు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో హస్త కళాకారులు చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకునే విధంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

మాతృభూమి సంస్థ అధ్యక్షులు రమాకాంత్ మాట్లాడుతూ కుటుంబంలో సమాజంలో వాడే వస్తువులు ప్లాస్టిక్ తో తయారు చేసే వాటిని అధిక సంఖ్యలో వినియోగించి, పర్యావరణ కాలుష్యానికి అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికోసం హస్తకళల డిపార్ట్మెంట్ ద్వారా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వనరులతో వస్తువులు తయారు చేయించడం చాలా గొప్ప విషయమన్నారు. దీనికి సహకరించినటువంటి హస్తకళల డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు కొండలయ్య మాట్లాడుతూ వెదురు ద్వారా పని వస్తువులు తయారు చేయు మాకు ఉచితంగా పనిముట్లు అందజేసి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల నుండి 50 మంది స్వయంగా వచ్చి పనిముట్లు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల డిపార్ట్మెంట్ కు సంబంధించిన  జరూస్, శ్రీ సత్యనారాయణ, కోన తిరుపతయ్య, పులి మల్లేష్, మాతృభూమి మాతృభూమి ఫౌండర్ మంజుల, మాతృభూమి కోశాధికారి తోకల శ్రీదేవి వివిధ మండలాల అధ్యక్షులు, యువకులు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -