Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అధికారులు ఎన్ని దాడులు నిర్వహించిన మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక దందా ఆగడం లేదు. యథేచ్ఛగా కొనసాగుతోంది. తాడిచెర్ల మానేరు నుంచి కొందరు ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను మానేరు నది నుంచి కమర్షియల్ గా అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో శుక్రవారం ఉదయం కోయ్యూర్ పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తూ గ్రామ శివారు కు చేరే సరికి అప్పుడే ఇసుక లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ ఒకటి పోలీసులకు ఎదురైంది.

దానిని ఆపి విచారించగా ట్రాక్టర్ డ్రైవర్ వద్ద ఎలాంటి పర్మిట్ లేదు. తన పేరు పల్లపు రాజ్ కుమార్ భూపాలపల్లిని తెలిపి, ఇంటి అవసరాల కోసమని మానేరు నది నుంచి రాత్రి సమయంలో ట్రాక్టర్ ద్వార ఇసుకను చేరగొట్టి అధిక లాబానికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో కమర్షేయల్ గా భుపాలపల్లికి తిసుకువెళ్లి అమ్ముతున్నట్టు తెలిపినాడని చెప్పారు. వెంటనే ట్రాక్టర్ ను ఇసుకతో పాటుగా సిజ్ చేసి, వ్యక్తి పైన కేసు నమోదు చేసినట్లుగా కోయ్యూర్ ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై నిఘా ఉంచామని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా కేసులో ఉన్న వ్యక్తులపై షీట్ ఓపెన్ చేయడం తోపాటు, అవసరం ఐతే పీడీ యాక్ట్ కూడా ఉపయోగిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -