Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేడు, రేపు కూడా మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబయి, దిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్‌ నుంచి వచ్చే విమానాలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -