Saturday, June 13, 2026
E-PAPER
Homeజిల్లాలు25% రిజర్వేషన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు

25% రిజర్వేషన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు

- Advertisement -

పేద విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కు
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు 
నవతెలంగాణ-అచ్చంపేట
25% రిజర్వేషన్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు.. పేద విద్యార్థుల రాజ్యాంగ బద్ధ హక్కు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు మాదిగ అన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయివేట్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు 25% సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. కానీ నేటికీ అనేక ప్రయివేట్ విద్యాసంస్థలు ఈ చట్టాన్ని బేఖాతరు చేస్తూ వేలాది మంది పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు. ఈ హక్కును కాలరాస్తూ పేద పిల్లల భవిష్యత్తుతో ప్రయివేటు యాజమాన్యం చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యాశాఖాధికారులు కూడా పట్టించుకునే పాపాన పోలేదని అన్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరం నుంచైనా పాలకులు, అధికారులు దీనిపై దృష్టి సారించి, కచ్చితంగా ప్రయివేటు బడుల్లో 25 % అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వం కూడా సహకరించి, పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాలపై కొరడా ఝులిపించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -