Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐఐటీలో సీటు సాధించిన రామానుజన్ హైస్కూల్ విద్యార్థి

ఐఐటీలో సీటు సాధించిన రామానుజన్ హైస్కూల్ విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
ఇటీవల ప్రకటించిన జేఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో వడపర్తి గ్రామంలోని శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ విద్యార్థి తేజావత్ అఖిల్ నాయకి ఆల్ ఇండియా ర్యాంక్ 1122తో కేరళ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాలక్కాడ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు సాధించారు.అఖిల్ నాయక్ వడపర్తి గ్రామంలోని శ్రీనివాస్ సార్ రామానుజన్ హైస్కూల్లో నర్సరీ నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించి, పదవ తరగతిలో స్కూల్ టాపర్గా అట్లాగే ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 983 మార్కులు సాధించి ఐఐటి అడ్వాన్స్ లో 1122 ర్యాంకు  సాధించడం అభినందనీయం. ఇది తన ప్రతిభకు నిదర్శనం ఈ సందర్భంగా అతన్ని పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అట్లాగే గ్రామ( మొండికుంట తండా ) పెద్దలు గ్రామీణ విద్యార్థి ఎస్సార్ స్కూల్లో చదవడం వల్లే ఈ ఘనత సాధించాడని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -