ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు మండలంలో మంగళవారం పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ తెలిపారు. ముందుగా గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన గోరంట్ల సాంబశివరావు కి (60,000/-) రూపాయలు, తుమ్మ రేష్మశ్రీ కి (16,500/-) రూపాయలు, రాఘవపట్నం గ్రామానికి చెందిన సదాశివ చారి కి (8000/-) రూపాయలు మరియు కంటెం మొగిలికి (60,000/-) రూపాయల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు మెడికల ఖర్చుల నిమిత్తం రాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ బృందం ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, సూడి సత్తిరెడ్డి, జెట్టి సోమయ్య, , పాలడుగు వెంకటకృష్ణ, మద్దాలి నాగమణి, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, జంపాల చంద్రశేఖర్, కంటెం సూర్యనారాయణ, పొడెం, అజ్మీర సమ్మాలు, చెన్న లక్ష్మణ్, తుమ్మ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love