ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు

శ్రీనివాస చిట్టూరి, వెంకట్‌ ప్రభు, నాగచైతన్య, కృతిశెట్టి నాగ చైతన్య, వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్‌ ‘కస్టడీ’. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. పవన్‌కుమార్‌ సమర్పించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేక కతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్‌ సీన్‌, పోలీస్‌ స్టేషన్‌లో సింగిల్‌ షాట్‌ ఫైట్‌, ట్రైన్‌ ఫైట్‌, ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కు మంచి స్పందన వచ్చింది. కొత్తగా చేయాలని ప్రయత్నం చేశాను’ అని అన్నారు. ‘దర్శకుడు వెంకట్‌ ప్రభు నన్ను నమ్మి మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు థియేటర్‌లో మంచి అప్లాజ్‌ వస్తుంది’ అని హీరోయిన్‌ కతిశెట్టి చెప్పారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ, ‘తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకి వస్తున్న గొప్ప ఆదరణకు థ్యాంక్స్‌ చెబుతున్నా. వందశాతం మా కష్టం ఫలించింది అనుకుంటున్నా. అంబులెన్స్‌తో కంపేర్‌ చేస్తూ కొన్ని రివ్యూలు చూశాను. అలా వారు రాసినందుకు థ్యాంక్స్‌. యాక్షన్‌ ఫిలిం ఇది. యాక్షన్‌ పరంగా బాగున్నాయని రాశారు కూడా. సినిమాను తెలుగు, తమిళంలో కూడా బాగా ఆదరిస్తున్నారు. కుటుంబంతో వెళ్ళి సినిమా చూసి ఎంజారు చేయండి’ అని తెలిపారు. నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి మాట్లాడుతూ, ‘కస్టడీ బ్లాక్‌ బస్టర్‌ అయినందుకు ఆనందంగా ఉంది. కథలో ఏది నమ్మామో అది వర్కవుట్‌ అయింది’ అని అన్నారు.

Spread the love