సరికొత్త కాన్సెప్ట్‌

సుడిగాలి సుధీర్‌, దివ్య భారతి జంటగా ‘పాగల్‌’ ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నిర్మాతలు చంద్ర శేఖర్‌ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్‌, లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్‌ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌ కొట్టగా, జెమినీ కిరణ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత చంద్ర శేఖర్‌ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ,’ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్‌ కర్త, కర్మ, క్రియ. లియో మ్యూజిక్‌ అందిస్తున్నారు’ అని తెలిపారు.’మా ప్రొడ్యూసర్స్‌ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్‌ కాకుండా అన్ని చేసి పెట్టారు’ అని దర్శకుడు నరేష్‌ కుప్పిలి చెప్పారు. మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ,’ఎన్నో హిట్‌ సినిమాలు చేసాను. ఇది కూడా ఒక హిట్‌ సినిమా అవ్వబోతుంది’ అని అన్నారు. ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని చెప్పారు.

Spread the love