చెడ్డి గ్యాంగ్‌ తమాషా రిలీజ్‌కి రెడీ

అబుజా ఎంటర్టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్త నిర్మాణంలో వెంకట్‌ కళ్యాణ్‌ దర్శకత్వంలో సిహెచ్‌ క్రాంతి కిరణ్‌ నిర్మించిన
చిత్రం ‘చెడ్డి గ్యాంగ్‌ తమాషా’. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టైటిల్‌ టిజర్‌ను నటుడు సునీల్‌ లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సిహెచ్‌ క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ,’మా మూవీ టైటిల్‌ పోస్టర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి, టైటిల్‌ టిజర్‌ను సునీల్‌, టీజర్‌ను దర్శకుడు నాగ్‌అశ్విన్‌, ట్రైలర్‌ను బ్రహ్మానందం రిలీజ్‌ చేయటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్‌ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఫిబ్రవరి రెండవ వారంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా కచ్చితంగా అలరిస్తుంది’ అని తెలిపారు. వెంకట్‌ కళ్యాణ్‌, గాయత్రి పటేల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి డి ఓ పి: జి కె యాదవ్‌ బంక, సంగీతం: అర్జున్‌, లిరిక్స్‌: విహారి, ఎడిటింగ్‌ : నర్సింగ్‌ రాథోడ్‌, ఆర్ట్‌ : రెడాన్‌ ఎస్కే, కొరియోగ్రాఫర్‌ : భాను.

Spread the love