యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా

హీరో సందీప్‌ కిషన్‌ నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు.
విజరు సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, దివ్యాంశ కౌశిక్‌, వరుణ్‌ సందేశ్‌, గౌతమ్‌ మీనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్‌ సి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాయి. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ సమర్పకులు.
ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ,’ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. మేమందరం కథని, దర్శకుడు రంజిత్‌ని బలంగా నమ్మాం. మా నమ్మకాన్ని ట్రైలర్‌కి వచ్చిన స్పందనే నిలబెట్టింది. ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్దగా మారిందంటే దానికి కారణం భరత్‌. అలాగే సునీల్‌, రామ్‌ మోహన్‌కి కతజ్ఞతలు. కథ, కంటెంట్‌, ఫిల్మ్‌ మేకింగ్‌ పరంగా ‘మైఖేల్‌’ యూనివర్సల్‌గా రీచ్‌ అయ్యే సినిమా’ అని అన్నారు. ‘ఈ కోసం అందరం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం. ముఖ్యంగా సందీప్‌, దర్శకుడు రంజిత్‌ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. అలాగే వరుణ్‌ సరికొత్త స్వాగ్‌తో తెరపై కనిపిస్తారు’ అని నాయిక దివ్యాంశ కౌశిక్‌ చెప్పారు. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సందీప్‌ కోసం పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఈ సినిమాని చూసి చాలా పెద్ద సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఇందులో యాక్షన్‌, రొమాన్స్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని భారీ నిర్మించారు’ అని దర్శకుడు రంజిత్‌ జయకోడి చెప్పారు.

Spread the love